డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫిస్ వద్ద దూసుకెళ్తున్న పుష్ప త్వరలో ఓటీటీలోనూ రాబోతున్నది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ఇండియా సినిమాను సంక్రాంతి కానుకగా ఈ నెల 7 నుంచి ఓటీటీలోనూ ప్రసారం కానుందని అధికారిక ప్రకటన వచ్చింది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిన పుష్ప సినిమా ఈ నెల 7న రాత్రి 8 గంటల నుంచి తమ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ఫొటోను పోస్ట్ చేసింది. ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు.. బాక్సాఫిస్ వద్ద దూసుకు పోతుంది. ఇక ఓటీటీలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన విషయం తెలిసిందే.
అనుకున్నదే జరిగింది రాధేశ్యామ్ వాయిదా