పోలీసు ఆఫీసర్ గా చార్జ్ తీసుకోనున్న ప్రభాస్

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ చిత్రీకరణ పూర్తయింది. ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి కె.కె. రాధా క్రిష్ట కుమార్ దర్శకత్వం వహించారు. క్రిష్టం రాజు సమర్పణలో వంశీ ప్రమోద్, ప్రసీద చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రభాస్ హీరో గా నటిస్తున్న మరో చిత్రం ఆదిపురుష్ దాదాపుగా షూటింగ్ పూర్తయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న మరో చిత్రం సలార్ ను పూర్తి చేసే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నారు. కాగా మరో చిత్రానికి ప్రభాస్ ఓకే చెప్ఫారు. వరుస సినిమాలతో బిజీగా డార్లింగ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ అనే పాన్ ఇండియా మూవీలో నటించనున్నారు.

- Advertisement -

సందీప్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పారు ప్రభాస్. ఇది ప్రభాస్ కు 25వ సినిమా కావడంతో హీరో పాత్రను వైవిద్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు డైరెక్టర్. తొలిసారిగా ప్రభాస్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషన్ కుమార్ తెలిపారు. కాగా ప్రభాస్ ఈయోడాది చివర్లో చార్జ్ తీసుకుంటారు. అదేనండీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

సూపర్ స్టార్ ట్వీట్.. స్టైలిష్​ స్టార్​ రిప్లే… తగేదే ల్యే..!

బాలయ్యను ఢీ కొట్టనున్న జయమ్మ

సినీ రంగం పెద్దగా వర్మ ఉండాలట..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -