అనుకున్నదే జరిగింది రాధేశ్యామ్ వాయిదా

- Advertisement -

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలు , కర్ప్యూలు వంటివి విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో నిర్మించిన పాన్ ఇండియా మూవీలను నిర్మాతలు వాయిదా వేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉన్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా వాయిదా పడనుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా యూనిట్ స్పందించింది. ‘రాధేశ్యామ్ విడుదల కోసం కొంత కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అయితే దేశంలో విపరీతంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులను క్రమంలో అందరి భద్రతను ద్రుష్టిలో ఉంచుకొని రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తాము’ అని సినిమా యూనిట్ ట్విటర్ వేదికగా తెలిపింది.

- Advertisement -

కరోనా కేసులు పెరుగుతున్నకూడా అనుకున్న ప్రకారమే సంకక్రాంతికి రాధేశ్యామ్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓటీటీలో కూడా విడుదల చేస్తారని, ఇందుకోసం భారీ ఆఫర్ కూడా వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే అందరి అంచనాలకు భిన్నంగా సినిమాను వాయిదా వేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది.

పోలీసు ఆఫీసర్ గా చార్జ్ తీసుకోనున్న ప్రభాస్

సూపర్ స్టార్ ట్వీట్.. స్టైలిష్​ స్టార్​ రిప్లే… తగేదే ల్యే..!

బాలయ్యను ఢీ కొట్టనున్న జయమ్మ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -