Saturday, April 27, 2024
- Advertisement -

ఎంసిఏలో ఈ సీన్ ఎందుకు తీసేసారు

- Advertisement -

దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ మూవి… ఎంసిఏ చిత్రం ఫస్టాఫ్ పరంగా మంచి ప్రజాదరణ పొందింది. దిల్ రాజు చేతిలో థియేటర్లు ఎక్కువగా ఉండడంతో సినిమాకు ప్రాబ్లెమ్ లేకుండా పోయింది. ఓవర్సీస్ లోను నాని అభిమానులు సినిమాకు పట్టం కడుతున్నారు. దీంతో నాని కోసమని ఎంసిఏకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి తోడు హలో చిత్రాన్ని పైకి లేపుదామనే తలంపులో కొందరు ఎంసిఏను డౌన్ చేసి మాట్లాడుతున్నారు.

కాని ఇక్కడ గుర్తించుకోవల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే…. ఫస్టాప్ బాగుండి సెకండాప్ రొటీన్ గా ఉన్నంత మాత్రాన ఎంసిఏ చిత్రం… హలో చిత్రం కంటే తక్కువది కాదు. అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. నాని నటించిన ఎంసిఏలో నిడివి సమస్యతో కొన్ని సీన్లను కట్ చేశారు. వాటిలో ఒక సీన్ ఇపుడు బయటకు వచ్చింది. రీరికార్డింగ్ కాకపోవడం వలన క్వాలిటీ తగ్గిందనుకోండి .అది వేరే విషయం. బట్ నానికి పిన్నిగా నటించిన ఆమని నానిని సపోర్ట్ చేసే విధానం మాత్రం బాగుంది. అలాగే స్వీట్ షాప్ కు వచ్చి అన్ని తినేసి కొన్ని స్వీట్స్ కట్టమంటే నాని అతనికి పంచ్ ఇచ్చే సీన్ అలరించింది. మరి ఈసీన్ సినిమాలో ఎందుకు లేదు అని అడిగితే ఏం చెబుతాం. ఉన్న బెస్ట్ సీన్లను తీయలేకనే ఈ సీన్ తీసేసారట. ఆ సీన్ మీకోసం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -