Monday, April 29, 2024
- Advertisement -

అల్లు శిరీష్ ఈసారైనా హిట్ కొడతాడా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ ఒక్క హిట్టు కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. గౌరవం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు.

స్టార్ ప్రొడ్యూసర్ తనయడు.. స్టార్ హీరో సోదరుడు ఈ కుర్ర హీరో తలుచుకుంటే మంచి కథతో స్టార్ డైరెక్టర్ తో హిట్టు కొట్టడం పెద్ద విషయం కాకపోయినా.. మనోడు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని తెలుస్తుంది. అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

రాకేష్ శశి దర్శకత్వంలో, మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో.. ‘100% ల‌వ్’, ‘భలే భ‌లే మ‌గాడివోయ్’, ‘గీత‌గోవిందం’, ‘ప్ర‌తిరోజూ పండుగే’ వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది.

https://twitter.com/AlluSirish/status/1399010213408083968?s=20

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -