Sunday, April 28, 2024
- Advertisement -

ఆ దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కర్ణన్ రీమేక్?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు.ఈ ఏడాది మొదట్లో అల్లుడు అదుర్స్ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈసారి కూడా అతనికి చేదు అనుభవమే ఎదురైంది. ఈ క్రమంలోనే గతంలో తమిళ రీమేక్ సినిమాలో నటించిన రాక్షసుడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ చిత్రం కర్ణన్ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తెలుగులో ఈ చిత్రాన్ని మొదట్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం ఈ సినిమాను బెల్లంకొండ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం చేయబోతున్నారని సమాచారం వినబడుతోంది.అయితే ఇప్పటికే వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ చత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నట్లు మనకు తెలిసిందే.

Also read:ఆ సెంటిమెంట్ తో భయపడుతున్న.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం!

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేలోపు తెలుగులో కర్ణన్ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు వినాయక్ ని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Also read:అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -