Saturday, May 4, 2024
- Advertisement -

నెమ్మ‌దించిన అల్లు హీరో

- Advertisement -

క‌నిపించ‌ని ఒక్క క్ష‌ణం ప్రమోష‌న్స్‌

ప్రస్తుతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంసీఏ టాక్ న‌డుస్తుండ‌గా త‌ర్వాత హ‌లో సినిమా ముచ్చ‌ట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో అల్లు వార‌సుడు శిరీశ్ గ‌మ్మున‌య్యాడు. అత‌డు న‌టించిన సినిమా ఒక్క క్ష‌ణం. బాక్సాఫీస్‌ను కళకళలాడించే సినిమాలుగా క్రిస్మస్‌కి నాని ఎంసీఏ, అఖిల్ హ‌లో రూపంలో వ‌స్తున్నారు.

వీటితో పాటు అల్లు శిరీశ్ నటించిన ఒక్కక్షణం విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 23వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. థియేటర్స్ స‌మ‌స్య లేకుండా ఉండేందుకు వారం వెనక్కు వెళ్లింది ఈ సినిమా. ప్రస్తుతం ఎంసీఏ.. హలో చిత్రాల మ‌ధ్య తానెందుకు అని నెమ్మ‌దించాడు. అయితే ఈ సినిమా ప్రమోష‌న్స్ కార్య‌క్ర‌మాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కొన్ని రోజుల్లో సినిమా విడుద‌ల‌వుతున్నా ఎలాంటి ప్ర‌చారాలు చేయ‌డం లేదు. ఎంసీఏ, హ‌లో హంగామాలో శిరీశ్‌ సినిమా సంగతులు క‌నిపించడం లేదు. ఒక్క క్ష‌ణం సినిమా వీఐ ఆనంద్ దర్శకత్వం వ‌హించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -