Thursday, May 9, 2024
- Advertisement -

ఏం చెప్ప‌ల‌నుకుంటున్నావా అల్లువార‌బ్బాయి

- Advertisement -

అల్లు కాంపౌండ్ జ‌నాల‌పై రుద్దాల‌నుకుంటోన్న హీరో అల్లు శిరీష్. ఇత‌గాడిని ఎలాగైనా స‌రే హీరోగా నిల‌బెట్టాల‌ని ట్రై చేస్తోన్న వైనం చూస్తుంటే.. కాస్త ఆలోచ‌న రాక‌మాన‌దు. యాక్టింగ్ ఓకే అనిపించుకున్న‌ప్ప‌టికీ… ఎక్క‌డో లోపం ఇత‌గాడిని పైకి లేప‌కుండా చేస్తుంది. తాజాగా ఒక్క క్ష‌ణం పేరుతో మ‌రోసారి ఇత‌న్ని నిల‌బెట్టాల‌ని చూస్తున్నారు. ఈ సినిమాకు విఐ ఆనంద్ డైరెక్ష‌న్ చేస్తూ ఉండ‌డం..తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ బాగుండ‌డంతో …సినిమాపై కాస్త ఆస‌క్తి రేకెత్తింది.

ఈ పోస్ట‌ర్ లో ఓ రెండు అగ్గిపుల్ల‌ల‌ను పెట్టుకుని… లవ్ వర్సెస్ డెస్టినీ అంటూ క్యాప్ష‌న్ ఒక‌టి త‌గిలించుకుని…. మ్యాట్రిక్స్ సినిమాలో వ‌చ్చే దాడుల‌ను ఆపుతున్న‌ట్లుగా స‌మ్ థింగ్ ఫిక్ష‌న్ ను అందుల్లో చూపించారు.దీనికి తోడు హీరోయిన్ సురభితో కలసి అలా డెస్టినీని ఎదిరిస్తాడు అనే తరహాలో ఈ లుక్ ఉంది.మ‌న‌కు గ‌తంలో ఎక్కడికిపోతావు చిన్నవాడా పోస్టర్ కూడా ఇలాంటి త‌ర‌హా ఫీలింగ్ నే ఇచ్చింది. దానికి కాపీ అన్న‌ట్లుగానే ఈ పోస్ట‌ర్ నిలిచింది. దీనికి తోడు చ‌డీ చ‌ప్పుడు చేయ‌కుండా మావాడు డిసెంబర్ లోనే బరిలోకి దిగేలా క‌నిపిస్తున్నాడు. ప్రమోషన్లు చకచకా స్టార్ట్ చేసి మనోళ్లు డిసెంబర్ 23న లేదంటే 29న సినిమాను రిలీజ్ చేస్తారట. అది సంగతి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -