Friday, May 17, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డిని ప్ర‌భాస్ ఫ్రెండ్స్ ఏమ్ చేస్తారో

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ఫిదా కాని యూత్ ఉండ‌రు. ఎట్ ప్ర‌జంట్ స్విచ్ వేష‌న్ ను క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. దాంతో ఈ మూవీ ఎక్క‌డికో వెళ్లిసోయింది. వ‌సూళ్లు కూడా మ‌తి పోగొట్టేలా చేశాయి. ఆ ఇదితోనే మ‌నోడు అర‌డ‌జ‌ను చిత్రాల‌కు సైన్ లు చేసేశాడు. నిజానికి అంత‌లా సైన్ లు చేయ‌కుండా ఉండాల్సింది. ఉండ‌లేక సైన్ లు పెట్టేశాడ‌నే వారు ఉన్నారు. అందులో గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్.. వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బ్యాన‌ర్లు కూడా ఉన్నాయి. అంతా భాగానే ఉంది కాని…. ఇత‌ను చేసిన సైన్ల‌లో ఎవ‌రితో ఎలాంటి చిత్రాల‌ను చేయాల‌ని క‌మిట‌య్యాడో తెలిస్తే కూడా భాగుంటుంది.

మ‌రీ ముఖ్యంగా మ‌నోడు యువి క్రియేష‌న్ కు చేసిన సైన్ ప్ర‌కారం అందుల్లో ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్ పాత్ర అని తెలిసింది. టైటిల్ కూడా ట్యాక్సీ డ్రైవ‌రే అనుకుంటున్నారట‌. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించి.. గ‌తంలో ‘ది ఎండ్’ అనే హార్రర్ సినిమా తీసి పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘ట్యాక్సీవాలా’ రూపొందుతోంది. క‌థ ప్ర‌కారం… ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందట. ఫిబ్రవరి లేదా మార్చిలో ‘ట్యాక్సీవాలా’ ప్రేక్షకుల ముందుకు రావొచ్చని తెలుస్తోంది. ఒక భాగ‌మ‌తి ఇంకో వైపు ట్యాక్సీవాలా చిత్రాల‌ను ఏక‌కాలంలో చేస్తూన్న‌ ప్ర‌భాస్ ఫ్రెండ్స్ వేమారెడ్డి వంశీ,ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్ లు విజ‌య్ ను ఎక్క‌డికి తీసుకుపోతారో చూడాలి. . అన్న‌ట్లు ఇంకో విష‌యం….రెండేళ్ల వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ డైరీలో ఖాళీ లేనట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -