Thursday, May 2, 2024
- Advertisement -

సొంత వాళ్లను న‌మ్మ‌డమే జ‌గ‌న్ చేసిన‌ నేర‌మా..? లేక పాప‌మా..?

- Advertisement -

ఒక నాయ‌కుడు త‌న వాల్ల‌ను న‌మ్మితే వారికోసం….ఎంత‌దూర‌మైనా వెల్తారు…న‌మ్మ‌కం అలాంటిది. సొంత వాళ్ల‌కంటె ఎక్కువ‌గా న‌మ్మినోళ్లే అదును చూసి దెబ్బ‌కొడితే ఆ నాయ‌కుని ప‌రిస్థితి ఎలాఉంటుంది..? న‌మ్మ‌కం అనేది త‌యారు చేసుకొనే వ‌స్తువు కాదు. బ‌జారులో కొనుక్కొనే అట వ‌స్తువు కాదు. మ‌రేం చేయాలి…? ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిస్థితి కూడా అలానె త‌యార‌య్యింది. న‌మ్ముకున్న వాల్లంతా న‌ట్టేట ముంచుతుంటే జ‌గ‌న్ ఏం చేయ‌గ‌ల‌డు..?

కాంగ్రెస్‌, టీడీపీ క‌ల‌సి కుట్ర‌లు చేసి జ‌గ‌న్‌పై కేసులు పెట్టినా వాట‌న్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కోసం ముందుకు వెల్తున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీనె ఎదిరించి వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెట్టి త‌న కాంగ్రెస్ నుంచి త‌న పార్టీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామ చేయించి ఎన్నిక‌ల్లో గెలిపించుకున్నారు. త‌ర్వాత జ‌రిగిన 2014 సాధార‌న ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌తో అధికారాన్ని కోల్పోయారు. మోదీ ఇమేజ్‌, ప‌వ‌న్ స‌పోర్టుతో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది.

అయితే ఆ త‌ర్వాత వైసీపీ నుంచి గెలిచిన నేత‌లు టీడీపీలోకి ఫిరాయించ‌డం మొద‌లు పెట్టారు. జ‌గ‌న్ ఎవ‌ర్ని అయితే న‌మ్ముకున్నారో వారే న‌మ్మించి మోసం చేసి అధికార‌పార్టీ ఇచ్చే తాయిలాల‌కు ఆశ‌ప‌డి టీడీపీలోకి ఫిరాయించారు. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూకు జ‌గ‌న్ ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. అలాంటిది మంత్రి పదవి కోసం చివకు జగన్ ను కాదనుకుని తన మద్దతుదారులతో టిడిపిలోకి ఫిరాయించారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓ క్యాబినెట్ ర్యాంకు పోస్టు వస్తుంది. అది సెంబ్లీ పిఏసి ఛైర్మన్ పోస్టు. ఆ పోస్ట్‌ను భూమా నాగిరెడ్డి జ‌గ‌న్ అప్ప‌గించారు. ఆ పోస్ట్‌ను సంవ‌త్స‌రం పాటు ఎంచాయ్ చేసి చివ‌ర‌కు కూతురు, బావ‌మ‌ర్దితో స‌హా ప‌చ్చ కండువా క‌ప్పుకున్నారు.

ఆధరించి టిక్కెట్టిచ్చి గెలిపించుకున్న ఆదినారాయణరెడ్డి కూడా వైసిపి నుండి వెళ్ళిపోయి మంత్రిపదవి తీసుకున్నారు. ఉత్తరాంధ్రలోని బొబ్బిలి రాజులని సుజయ్ కృష్ణ రంగారావుకు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తే వాళ్ళూ దెబ్బకొట్టి టిడిపికి జై కొట్టారు. మరో ఫిరాయింపు మంత్రి ఎన్. అమరనాధరెడ్డిది కూడా అదే దారి. తాజాగా ఫిరాయించిన గిడ్డి కూడా మంత్రిపదవి హామీతోనే పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జ‌గ‌న్ ఎవ‌ర్ని న‌మ్మాలో అర్థంకాని ప‌రిస్తితి. పార్టీలో ఎవ‌రిని న‌మ్మాల‌న్నా వంద‌సార్లు జ‌గ‌న్ ఆలోచించాల్సి వ‌స్తోంది.

అప్పులు తీర్చుకోవటానికని కొందరు, మంత్రిపదవుల కోసం మరికొందరు, కాంట్రాక్టులు, ఆర్ధిక అవసరాలని ఇంకొందరు, త‌మ‌పై ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి ఇలా ప‌లు కార‌ణాల‌తో ఇప్ప‌టికే 23 మంది ఫిరాయించేశారు. టిడిపి కూడా నిశ్శుగ్గుగా బహిరంగంగానే తమ గొప్పదనం చూడండని జబ్బలు చరుచుకుంటోంది. పైగా అభివృద్ధిని చూసి పార్టీలోకి వ‌స్తున్నారంటూ క‌ప్పిపుచ్చుకుంటున్నారు.

ఇక్కడే చంద్రబాబు-జగన్ మధ్య ఒక పోలిక స్పష్టమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు పరిస్ధితి ఇంతకన్నా ఘోరంగా ఉండేది. అయితే, అప్పట్లో టిడిపి నుండి వైసీపీలోకి వస్తామన్న చాలామంది ఎంఎల్ఏల చేత జగన్ అప్పట్లో రాజీనామాలు చేయించే పార్టీలోకి చేర్చుకున్నారు. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు చేస్తున్న దేంటి రాజ్యాంగ విలువ‌ల‌కు తిలోద‌కాలిచ్చి ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా వేలంపాట‌లో కొన్న‌ట్లు కొంటున్నారు. నిద్ర‌లేచిన‌ప్ప‌టినుంచి నిద్ర‌పోయోంత వ‌ర‌కు నిప్పు,నిజాయితీ,నీతి అని చెప్పుకొనే బాబు చేస్తున్న‌దేంటో ఆయ‌న‌కే అర్థం కావాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -