Wednesday, May 15, 2024
- Advertisement -

ఒక్క క్ష‌ణం టీజ‌ర్‌లో అల్లు శిరీశ్‌

- Advertisement -

నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదికి వస్తే ఫేట్‌తో అయినా.. డెస్టినీతో అయినా.. చివరికి ఆ చావుతో అయినా పోరాడతా’’ అంటూ అల్లు శిరీశ్ అంటున్నాడు. తాను న‌టించిన ఒక్క క్ష‌ణం టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల అయ్యింది. ఈ సినిమా ఉత్కంఠ క‌లిగించేలా ఉంద‌ని తెలుస్తోంది. విలన్ నుంచి హీరోయిన్‌ను కాపాడే పాత్రలో శిరీశ్ కనిపిస్తున్నాడని అర్థమవుతోంది. నిమిషం నిడివి ఉన్న టీజర్‌తో ఆక‌ట్టుకుంటోంది. సురభి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా చక్రి చిగురుపాటి నిర్మాత కాగా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వ‌స్తోంది.

ఎక్క‌డికి పోతావురా చిన్న‌వాడ సినిమా క‌థ విభిన్నంగా అందంగా తీర్చిదిద్దిన ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ఒక్క క్ష‌ణం తీశాడు. ఈ సినిమా కూడా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా నిలిచేట‌ట్టు తెలుస్తోంది.

టీజ‌ర్ ప్రారంభమే ఒక ప్రొఫెసర్ కొన్ని అగ్గిపుల్లలు పైనుంచి విసిరితే అందులో రెండు సమాంతరంగా పడతాయి. కొన్ని అగ్గిపుల్లలు చెల్లాచెదురుగా విసిరితేనే అందులో రెండు సమాంతరంగా పడ్డప్పుడు.. ఇద్దరు మనుషుల జీవితాలు ఒకేలా ఎందుకుండవు అని టీజ‌ర్ ప‌డుతూ స్టార్ట‌వుతుంది. ఈ మాట చెప్పి ఓ వ్యక్తి ప్రెజెంటే.. మీ ఫ్యూచర్ అంటూ హీరో హీరోయిన్లకు చెబుతాడు. ఆ త‌ర్వాత అవసరాల శ్రీనివాస్ వ‌స్తాడు. ఇందులో అతడిది భయానకమైన పాత్రలా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -