Saturday, May 4, 2024
- Advertisement -

టాలీవుడ్‌లో వేధింపులు ఉన్నాయంటున్న భామ‌

- Advertisement -

అందంగా లేవ‌ని… నీ క్యారెక్ట‌ర్ బాలేద‌ని వ‌దిలేసే బాయ్‌ఫ్రెండ్‌లు ఉంటారు. మంచిగా సంపాదిస్తున్న అమ్మాయి… తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అంతా తెలిసిన అమ్మ‌డు.. ఆమె అంటే ప‌డి చ‌చ్చే అభిమానులు ఉంటారు.. అలాంటి అమ్మాయి ప్రేమికుడు సినిమాల్లోకి వ‌చ్చావ‌ని వ‌దిలేసిన దౌర్భాగ్యం. ఇలాంటిది ఎక్క‌డైనా ఉంటుందా? అస‌లు వాళ్లు ఒప్పుకోవ‌డ‌మే గొప్ప‌. అలాంటిది ఆ అమ్మాయి ప్రేమించిన వ‌దిలేసుకున్నాడ‌ని కొమ‌రం పులి భామ నికిషా ప‌టేల్ వాపోతుంది.

కేవలం హీరోయిన్ గా మారాననే కారణంతోనే నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు.” నికీషా పటేల్ చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా మారడంతో తన వ్యక్తిగత జీవితం పూర్తిగా దెబ్బతిందని బాధ‌ప‌డుతోంది.

“కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు లైంగిక వేధింపులు కామన్ అయిపోయాయి. హాలీవుడ్‌లో హార్వే వ్యవహారం బయటకొచ్చిన తర్వాత నాన్న నాకు ఫోన్ చేశారు. టాలీవుడ్‌లో ఇలాంటివి జరుగుతున్నాయా అని నన్ను అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. కాస్టింగ్ కౌచ్ విషయానికొస్తే హాలీవుడ్‌, టాలీవుడ్‌కు పెద్ద తేడా లేదు.” లైంగిక వేధింపులు టాలీవుడ్‌లో కూడా ఉన్నాయని ఇలా పరోక్షంగా చెప్పుకొచ్చింది నికీషా పటేల్. ఈ విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఈ ముచ్చ‌ట చెప్పుకొచ్చింది. అయితే అత‌డెవ‌రు? ఎన్నాళ్లు వీరి ప్రేమ అనేది ఏమీ చెప్ప‌లేదు. ఆ విధంగా ఆమెను వ‌దిలేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -