Saturday, May 25, 2024
- Advertisement -

‘ఎవెంజర్స్’ ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల బ్ర‌హ్మ‌ర‌థం

- Advertisement -

ప్ర‌పంచంలో అతిపెద్ద సినీ ప‌రిశ్ర‌మ హాలీవుడ్‌. ఆ ప‌రిశ్ర‌మ‌లో విడుద‌ల‌య్యే సినిమా చివ‌రికి తెలంగాణ‌లోని ఓ చిన్న ప‌ట్ట‌ణంలో కూడా విడులయ్యేంత ప‌రిస్థితి ఉంది. ఆ సినిమాల‌కు ప్రేక్ష‌కాధ‌ర‌ణ కూడా అలా ఉంది. అలాంటి హాలీవుడ్ సినిమా ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కులు విశేషంగా చూసేశారు. విడుద‌లైన 24 గంట‌ల్లోనే 2.5 కోట్ల మంది చూసేశారు. ఆ సినిమాపై అంచ‌నాలు పెంచేసుకున్నారు. యూట్యూబ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఈ ట్రైల‌ర్‌నే చూస్తున్నారు. ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఎవెంజ‌ర్స్ సిరీస్‌లో ‘ఇన్ఫినిటీ వార్’ మ‌రో సినిమా. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది.

మార్వెల్ స్టూడియోస్ సంస్థ నాలుగు రోజుల కిందటే ‘ఎవెంజర్స్.. ఇన్ఫినిటీ వార్’ ట్రైలర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

‘ఎవెంజర్స్’ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి తగ్గట్లే ఈ ట్రైలర్‌కు కోట్ల సంఖ్య‌లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది కోట్ల మంది ఈ ట్రైలర్ చూశారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

‘ఎవెంజర్స్’ సినిమాలో స్పైడర్‌మ్యాన్.. ఐరన్ మ్యాన్.. హల్క్.. థోర్ లాంటి నలుగురైదుగురు సూపర్ హీరోలుంటారు. ఈ సిరీస్‌లో వచ్చిన కొత్త సినిమా ‘ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -