పాపం అమ‌లాపాల్ పై లైగింక వేధింపులు

అమ‌లాపాల్‌కి కాలం క‌లిసి రావ‌డం లేదు. కారు కొనుగోలు విష‌యంలో అరెస్ట్ అయ్యి బాధాప‌డుతుంటే….మ‌రోవైపు అమ‌లాపాల్‌ని లైగింక వేధింపులు కూడా ఎదురైయ్యాయి.వ్యాపారవేత్త అలగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెన్నైలోని పాండిబజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అలగేశన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో నటి అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు సమాజంలో భద్రత లేదని అన్నారు.

మాటలతో చేతలతో మహిళలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనను వేధించిన అలగేశన్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో కోరారు. . నటిగా ఉన్న తనకే ఇలాంటి వేధింపులు ఎదురైతే.. సామాన్య మహిళల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశముందని అన్నారు.