Saturday, May 18, 2024
- Advertisement -

నాగశౌర్యకు మెగా ఫ్యామిలీ సీరియస్ వార్నింగ్…..‘మంచితనాన్ని అలుసుగా తీసుకోకు’

- Advertisement -

తన సినిమా రిలీజ్ టెన్షన్స్‌లో, ప్రమోషన్స్ యాక్టివిటీస్‌లో ఉన్న నాగశౌర్యకు మెగా ఫ్యామిలీ నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ వచ్చింది. నాగశౌర్య సినిమా కోసం పిలిచిన వెంటనే మంచితనంతో చిరంజీవి వచ్చినప్పటికీ నాగశౌర్య మాత్రం ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకుని నాగశౌర్య డ్రామాలు ఆడుతున్నాడని మెగా ఫ్యామిలీ ఫీలవుతోంది. ఇప్పుడు అదే విషయంపై నాగశౌర్యకు మెగా ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది.

అసలు విషయానికి వస్తే ఒక మనసు సినిమాలో మెగా హీరోయిన్ నిహారికతో కలిసి నటించాడు నాగశౌర్య. ఆ సినిమా టైంలోనే నాగశౌర్యతో నిహారిక ప్రేమలో పడిందన్న రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ ఎవరు పుట్టించారు అన్న విషయంపై అప్పట్లోనే మెగా ఫ్యామిలీ ఆరా తీసింది. అసలే మెగాభిమానుల్లో చాలా మందికి నిహారిక హీరోయన్ అవ్వడం ఇష్టం లేదు. అలాంటి నేపథ్యంలో రూమర్స్ కూడా స్ప్రెడ్ అయితే ఇంకా కాంప్లికేట్ అవుతుందని ఆ తర్వాత మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ నాగశౌర్య మాత్రం ఒక మనసు సినిమా తర్వాత నుంచీ కూడా తన ప్రతి సినిమా రిలీజ్ సమయంలోనూ నిహారికతో వచ్చిన రూమర్స్‌ గురించి మాట్లాడుతూ తన సినిమాలకు క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిహారిక-నాగశౌర్య లవ్ రూమర్స్‌ని మీడియా హెడ్‌లైన్స్‌లో వచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే విషయంపై మెగా ఫ్యామిలీ సీరియస్ అయిందని తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ కోసం మా ఇంటి అమ్మాయి గురించి మాట్లాడడం……. మీడియాలో ప్రముఖంగా కనబడడం, పబ్లిసిటీ కోసం నిహారిక పేరును ప్రతిసారీ ప్రస్తావనకు తీసుకురావడం భావ్యం కాదని నాగశౌర్యకు మెగా వార్నింగ్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన ఒక ప్రొడ్యూసర్‌తో ఈ వార్నింగ్ సందేశాన్ని శౌర్యాకు పంపించింది మెగా ఫ్యామిలీ. ఇకపై నిహారిక గురించి మాట్లాడవద్దని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -