Friday, May 3, 2024
- Advertisement -

రెండో పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటా..!

- Advertisement -

సినీ ఇండ‌స్ట్రీ అంటనే గ్లామ‌ర్‌తో కూడ‌కున్నది.అందుకునేమో వారికి అంత‌లా అభిమానులు ఉంటారు.ఆ సినీ గ్లామ‌ర్ అడ్డుపెట్టుకుని మ‌న హీరోలు,హీరోయిన్స్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు తారలు రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఒకప్పుడు హీరోయినే.. నగ్మ, రోజా, విజయశాంతి ఇలా చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చారు.ఇప్పుడు మ‌రో స్టార్ హీరోయిన్ పొలిటిక‌ల్ ఎంట్రీకి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. తమిళ నటి అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆమె కొంత కాలానికే అతడి నుండి విడిపోయింది.

పెళ్లి త‌రువాత ఆమె మ‌రింత గ్లామ‌ర్‌తో న‌టించిన‌ప్ప‌టికి హిట్లు మాత్రం రాలేదు.ఆ స‌మ‌యంలోనే ఆమ‌ను వ‌రుస వివాదాలు వెంటాడాయి.తాజాగా ఆమలపాల్ నటించిన ‘రాక్షసన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఆమెకి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సంద‌ర్భంగా మీడియా మాట్లాడుతూ….. ”భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను” అని క్లారిటీ ఇచ్చింది. ఇక త‌న రెండో పెళ్లిపై గురించి కూడా మాట్లాడింది. నేను రెండో పెళ్లి గురించి ఆలోచించ‌లేదు.ఖ‌చ్చితంగా చేసుకుంటాను అని తెలిపింది.అయితే అది ఇప్పుడు కాద‌ని ,దానికి చాలా స‌మ‌యం ఉంద‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -