Saturday, May 18, 2024
- Advertisement -

అత్యంత ధనవంతురాలిగా నారా భువనేశ్వరి……అభివృద్ధి అదిరిపోలా

- Advertisement -

అత్యంత ధనవంతురాలైన బిజినెస్ ఉమెన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఘనతకెక్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి విషయం ఏంటి అంటే కడు బీద పలుకులు పలుకుతూ ఉంటాడు చంద్రబాబు. అలాంటి రాష్ట్రంతో పాటు, తెలంగాణాలోనూ విస్తారంగా వ్యాపారాన్ని విస్తరించిన హెరిటేజ్ ఫుడ్స్ పుణ్యమాని నారా భువనేశ్వరి వెయ్యి కోట్లను మించి ఉన్న బిజినెస్ విమెన్‌గా వినుతికెక్కారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెయ్యి కోట్లు మించి ఉన్నవాళ్ళు అటూ ఇటూగా యాభై మంది ఉన్నారు. వాళ్ళలో మహిళల సంఖ్య ఇంకా తక్కువ. అయితేనేం నారా భువనేశ్వరి మాత్రం అత్యంత ధనవంతురాలైన పారిశ్రామికవేత్తగా నిలిచారని బార్‌క్లేజ్ జాబితా స్పష్టంగా చెప్పింది. కావాలంటే వివరాలూ మీరూ చూసుకోవచ్చు.

ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలో జగన్ పేరు ఉంటే ఆ విషయాన్ని రచ్చ రచ్చ చేసింది పచ్చ బ్యాచ్. కానీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ధనవంతురాలైన బిజినెస్ విమెన్‌గా నారా భువనేశ్వరి నిలిచారని పచ్చ మీడియాలో ఎక్కడైనా చూశారా? భువనేశ్వరి స్థానంలో వైఎస్ భారతి ఉండి ఉంటే ఇదే పచ్చ మీడియా ఏ స్థాయిలో రంకెలేసి ఉండేది? ఈ పాటికి రచ్చ రచ్చ చేసి ఉండేది కాదా? అదీ తెలుగు ప్రజలను ఉద్ధరించడానికే ఉన్నాం అని అస్తమానం చెప్పుకునే బాబు భజన మీడియా జనాల అసలు నైజం. ప్రజాప్రతినిధులు ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే అని ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం అధికారికంగా తన ఆస్తుల వివరాలు ఇవ్వలేదు. ఇంకా చాలా మంది టిడిపి ప్రజా ప్రతినిధులు ఆస్తుల వివరాలు ఇవ్వలేదు. అలాంటి జాబితాలో జగన్ పేరు వినిపించింది. ఆ విషయాన్ని పట్టుకుని రచ్చ రచ్చ చేసిన పచ్చ మీడియా జనాలు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని జాతీయ స్థాయి సంస్థలు తేల్చి చెప్తే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? తెలుగు వాళ్ళందరిలోకి అత్యంత ధనవంతురాలైన బిజినెస్ విమెన్‌గా నారా భువనేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తే పచ్చ మీడియా ఎందుకు మౌనం దాల్చింది? దేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిసారీ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఒక వర్గం మీడియా మాత్రం కనీస మాత్రంగా కూడా వార్తను ప్రజలకు చేరవేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికే ఉన్నాం అని చెప్పుకునే పచ్చ పార్టీ, పచ్చ మీడియా అసలు ప్రాధాన్యాలు ఏంటో ఇంత స్పాష్టాతిస్పష్టంగా తెలిసిపోతున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వైఖరి ఎలా ఉంటుందో చూడాలి అన్న ఆసక్తి జాతీయ స్థాయిలో వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో కూడా బాబు గెలిస్తే మాత్రం ఎన్ని అక్రమాలు చేసినా, ఎంత అవినీతి చేసినా మీడియా ప్రచారంతో ఎన్నికల్లో గెలవొచ్చు అని నమ్మే నాయకులందరికీ చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తానడంలో సందేహం లేదు. ఇన్ని తప్పులు, ఇంత అవినీతి తర్వాత కూడా గెలిపిస్తే ఆ తర్వాత ఇక ఏ స్థాయిలో తప్పులు చేయడానికి అయినా పచ్చ పార్టీ, పచ్చ మీడియా జనాలు అస్సలు సందేహించారని సీనియర్ జర్నలిస్టులు బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -