Friday, May 10, 2024
- Advertisement -

చింతమనేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినా మారని పైత్యం

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి 24 గంటలు కూడా గడవకముందే పవన్ మళ్లీ అదే భాష మాట్లాడారు. వీధి రౌడీలు, ఆకు రౌడీలు అంటూ అదే స్థాయి రౌడీలా నోరు పారేసుకున్నాడు పవన్. చింతమనేని ప్రభాకర్ ను ఉద్దేశించి తల తీస్తాం, అగ్ని గుండం సృష్టించగలను, కత్తి పడతాను, కాళ్లు, కీళ్లు విరగ్గొడతాను, పిడికిళ్లలో కోపంతో వచ్చాను, డీజీపీ మీరు చర్యలు తీసుకుంటారా ? మమ్మల్ని తీసుకోమంటారా ? అంటూ అనాగరిక, ఆటవికమైన డైలాగులు చెప్పిన పవన్ మళ్లీ అదేస్థాయిలో స్పందించాడు. ఈ సారి టీడీపీతో పాటు వైఎస్ఆర్ సీపీ నేతలపై విరుచుకుపడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు గణపవరంలో పర్యటించిన పవన్ మళ్లీ నోటికి పని చెప్పాడు. తమ పార్టీ కార్యకర్తలను టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డాడు. ఆ బెదిరింపులకు తాము భయపడేది లేదన్నాడు. జనసేన కార్యకర్తలను వేధించితే, ఇబ్బంది పెడితే కాళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతాం, ఖబడ్దార్ అంటూ మళ్లీ పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నాడు.

అయితే బుధవారం తననుద్దేశించి పవన్ వాడిని తీవ్ర పదజాలంపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ, చంద్రబాబుతో హెలికాప్టర్లతో తిరిగిన స్థాయి కలిగిన పవన్ కళ్యాణ్ ఓ ఎమ్మెల్యేనైన నన్ను టార్గెట్ చేయడం ఏంటో అర్ధం కావడం లేదు. నా గురించి ఒక వైపే చూస్తున్నారు. రెండోవైపు చూడలేదు. ఓ పార్టీ అధ్యక్షుడిగా మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించండి అంతే కానీ, నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదు. 18 ఏళ్ల కుర్రాడిని పోటీకి పెడతానంటున్న పవన్ కి అసలు అసెంబ్లీకి, పార్లమెంట్ కి పోటీ చేయాలంటే ఎంత వయసుండాలో కూడా తెలియదా అని చింతమనేని కౌంటర్ ఇచ్చారు. ఎవరినో ఎందుకు మీరే వచ్చి నాపై పోటీ చేస్తే ఎవరేంటో తేలిపోతుందిగా ? అంటా సవాల్ విసిరారు. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటూ వార్నింగులు ఇచ్చిన పవనే ఓ పెద్ద రౌడీలా మాట్లాడాడని చింతమనేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేకహోదాపై మోడీని నిలదీయకుండా, ఇతర సమస్యపై దృష్టి పెట్టకుండా తల తీస్తాం, కాళ్లు విరగ్గొడతాం అంటూ పవనే పెద్ద రౌడీలా మాట్లాడాడని చింతమనేని మండిపడ్డారు.

అయితే బుధవారం పవన్ వాడిన భాషపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు అన్ని వర్గాల నుంచీ వచ్చాయి. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఇలా రెచ్చగొట్టడం ఏంటని జనం మండిపడ్డారు. ఆరు నెలలకు ఓ సారి బయటకు వచ్చి, స్థానిక ప్రజలకు, ప్రజాప్రతినిధులకు గొడవలు పెట్టి, రెచ్చగొట్టి మళ్లీ ఆరు నెలలు కనపడకుండా పారిపోతే..ఇక్కడ స్థానికులు తన్నుకుచావాలా ? అని ప్రజలు నిలదీస్తున్నారు. బాధ్యత గల నాయకుడు ఎవడూ ఇలా తల తీస్తాం, కాళ్లు విరగ్గొడం, అగ్నిగుండం సృష్టిస్తాం అంటూ రెచ్చగొట్టరని మండిపడుతున్నారు. పవన్ ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కార్యకర్తల మీద దాడులు చేస్తే, వేధిస్తే పోలీసులున్నారు, కోర్టులున్నాయి, ఓ వ్యవస్థ ఉంది దాని ప్రకారం వెళ్లాలి. లేదంటే మౌనపోరాటం, న్యాయపోరాటం, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు ఇలా ఇతర మార్గాల ద్వారా అందరి దృష్టికి తెచ్చి, న్యాయం కోసం పోరాడాలి కానీ, ఇలా తల తీస్తాం. కాళ్లు విరగ్గొడతాం, కోపంతో వచ్చాను. కత్తి పడతాను అంటూ ప్రజలను రెచ్చగొట్టడం ఏంటని అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలకోసారి ప్రజల్లోకి వచ్చే పవన్ వారు తనను మరిచిపోకూడదనే ఇలా విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మండిపడుతున్నారు. ఇలా నోటికొచ్చినట్లు వార్నింగులు ఇచ్చేసి, రెచ్చగొట్టేసి మరో ఆరు నెలల వరకూ కనపడకుండా పోతే, ఆయన మాటల ప్రభావంతో ఇక్కడ స్థానికులు వర్గాలుగా విడిపోయి హింసకు దిగితే ఎవరిది బాధ్యత పవన్ ? ఓ పార్టీ అధ్యక్షుడిగా ప్రతి మాటా ఆచితూచి ఆడాలని తెలియదా ? అసలు నువ్వు రాజకీయాలు చేయడానికి వచ్చావా ? రౌడీయిజం చేయడానికి వచ్చావా ? అని ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -