Thursday, May 16, 2024
- Advertisement -

అమ‌లాపాల్‌తో ఆ వ్యాపారం చేయ‌ల‌ని చూశారంటా!

- Advertisement -

అమ‌లాపాల్ ఈ మ‌ధ్య వార్తల్లో ఈ హీరోయిన్ నిలిచిన‌ట్లు మ‌రో హీరోయిన్ నిల‌వ‌లేదు.అంతలా ఈ భామ హల్ చ‌ల్ చేస్తుంది.కారు వివాదంలో జైలు కూడా వెళ్లోంచింది.త‌రువాత త‌న‌పై లైంగిక వేంధింపులుతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది అమ‌లాపాల్‌.అళగేశన్ అనే బిజినేస్ మ్యాన్ త‌నను లైంగికంగా వేధించగా ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుడిని అరెస్ట్ అయ్యేలా చేశారు ఈ నటి. నిందితుడు అళగేశన్ నాతో వ్యాపారం చేయాలని చూశాడు. అతడి ధైర్యం, వ్యవహారశైలి, అతడికున్న పరపతి చూసిన నాకు ఎంతో భయంవేసిందని మీటూ మూవ్‌మెంట్‌లో భాగంగా అమలాపాల్ ట్వీట్ చేశారు.

మలేషియాలో ఓ కార్యక్రమం నిమిత్తం నిర్వహిస్తున్న నృత్య శిక్షణ తరగతులను టీనగర్‌లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అమలాపాల్‌ను అళగేశన్‌ వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడి లొంగదీసుకునే యత్నం చేశాడు. దీనిపై నటి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై హీరో విశాల్ ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ‘లైంగిక వేధింపుల ఘటనలో నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశారు హీరో విశాల్. తనకు మద్ధతుగా నిలిచిన విశాల్‌కు తాజాగా థ్యాంక్స్ చెప్పారు అమలాపాల్ .

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -