ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ ట్విట్టర్‌లో ఎలాంటి ట్వీట్‌లు చేస్తారో అందరికి తెలిసందే.వారు వీరు అనకుండా తన దైన శైలిలో ట్వీట్ చేయడం వర్మకు అలవాటు. ఈసారి టీడీపీ ఎంపీలను లక్ష్యం చేసుకున్నాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే వర్మ… పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. టీడీపీ ఎంపీల ఫొటో ఒకటి పోస్టు చేసిన వర్మ…రెండు పోస్టులు పెట్టాడు.
తొలి పోస్టులో ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ ఎద్దేవా చేశాడు. మరొక పోస్టులో ‘టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు’ అంటూ కామెంట్ చేశాడు.
అధికార పక్షంలో ఉండి కూడా హోదాను సాధించలేకపోతున్న టీడీపీ.. మరో వైపు కూటమి నుంచి బయటకు వచ్చి పోరాటం చేయకుండా వేషాలు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామనే డ్రామాలు వర్మకు నచ్చక ఇలా ట్వీట్లు చేశాడన్న మాట. గతంలో కూడా వర్మ ఇలానే ట్వీట్‌లు చేయడం తెలిసిందే.
These guys of TDP are a national embarrassment to the international reputation of TDP pic.twitter.com/UxoIJVaI4H
— Ram Gopal Varma (@RGVzoomin) February 11, 2018
