Friday, May 3, 2024
- Advertisement -

హీరోయిన్ అమలాపాల్‌కు యాక్సిడెంట్‌

- Advertisement -

హీరోయిన్ అమలాపాల్‌కు షూటింగ్‌లో గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది.ఆమె న‌టిస్తున్న ‘అదో అంద పరవాయ్ పోల’ సినిమా షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా ఆమె గాయపడింది. ట్రీట్ మెంట్ కోసం ఆమె కేరళ వెళ్లింది. సినిమాలోని కీలక స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.సినిమా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా ఆమె మణికట్టు ట్విస్ట్ అయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉండే లిగమెంట్ చిట్లింది ఇది చిన్న గాయమే అని భావించిన అమలాపాల్… షూటింగ్ ను కొనసాగించింది.

అయితే, నొప్పి అంతకంతకూ తీవ్రతరం కావడంతో చిత్ర బృందం ఆమెను ఆసుపత్రికి తరలించింది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమెకు సూచించారు. చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో విడాకులు తీసుకున్న త‌రువాత వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తుంది అమ‌లాపాల్‌.త‌న సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల ఆర‌బోత‌కు తెర లేపింది అమలాపాల్.ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=h8RZ3Nz9Zns

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -