Sunday, May 19, 2024
- Advertisement -

విశాఖ‌లోకి ప్ర‌వేశించిన జ‌న‌నేత పాద‌యాత్ర‌..

- Advertisement -

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోకి ప్ర‌వేశించింది. 237వరోజు తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేపట్టిన జగన్.. ఆ జిల్లాను దాటుకొని విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం గన్నవరం మెట్టు గ్రామంలో అడుగుపెట్టారు. పార్టీనాయ‌కులు, క‌ర్య‌కర్త‌లు జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగంతం ప‌ల‌క‌డంతోపాటు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

నర్శీపట్నం నియోజక వర్గంలో ఇలా అడుగు పడిందో లేదో మంత్రి అయ్యన్నపాత్రుడికి అలా షాక్ తగిలింది. అయ్యన్న ఇలాకాలో గట్టి పట్టున్న ప్రజా నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న రుత్తల ఎర్రా పాత్రుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. జగన్ స్వయంగా అయనకు కండువా కప్పి మరీ ఆహ్వానించారు.

జగన్ జిల్లా టూర్ కి ముందే రుత్తల ఎర్రా పాత్రుడితో విజయసాయిరెడ్డి రాయబారం నడిపారు. పార్టీలో చేరితే స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.గతంలో అయ్యన్న పై పోటీ చేసిన ఎర్రా పాత్రుడు గణనీయమైన ఓట్లను తెచ్చుకున్నారు. అనేక ప్రజా పోరాటాలు చేసిన ఆయన కూడా మంత్రి సామజిక వర్గమే కావడంతో పాటు అన్ని పార్టీలలోనూ మిత్రులు ఉన్నారు.

ఎర్రా పాత్రుడి రాకతో వైసీపీకి మంచి బలం నర్శీపట్నంలో సమకూరుతుంది. అదే టైంలో ఈసారి ఎలాగైనా అయ్యన్నను ఓడించాలన్న జగన్ పంతమూ నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జ‌గ‌న్ అడుగు పెట్టిన వెంట‌నే మొద‌టి దెబ్బ మంత్రికి త‌గిలింద‌ని సెటైర్లు పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -