Sunday, May 19, 2024
- Advertisement -

మ‌హేష్ సినిమా రిలీజ్‌కు రెడీ!

- Advertisement -

ఒకప్పుడు సినిమాలు టీవిలో చూడాలంటే 100 రోజులు వ‌ర‌కు ఆగాల్సిందే. అయితే మారుతున్న కాలం బట్టి సినీ జ‌నాల‌లో కూడా మార్పు వచ్చింది. థియేటర్ కి వెళ్లి ప్రతి సారి చూసే ఓపిక జనాల్లో చాలా వరకు తగ్గింది. టెక్నాలిజీ పెరుగుతున్న కొద్దీ ఎదో ఒక విధంగా సినిమాలను మళ్లీ మళ్లీ చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంత పెద్ద సినిమా విడుదలైన కూడా 50 రోజులకు ముందే వెబ్ మీడియాల్లో దర్శనమిస్తోంది. వరల్డ్ లో అతిపెద్దదైన స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ అమేజైనే ప్రైమ్ లో ప్రస్తుతం చాలా సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే వచ్చేస్తున్నాయి.

రాంచ‌ర‌ణ్ న‌టించిన రాంగ‌స్థ‌లం సినిమా 50 రోజులు కాక‌ముందే సినిమాను అమేజైనే ప్రైమ్‌లో విడుద‌ల చేశారు.ఇప్పుడు మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అను నేను సినిమా కూడా అమేజైనే ప్రైమ్ విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతుంది.జూన్ 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో భరత్ అనే నేను టెలి క్యాస్ట్ అవ్వనుంది.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో మంచి కలెక్షన్స్ అందించిన చిత్రంగా నిలిచింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -