Friday, March 29, 2024
- Advertisement -

‘సైరా’లో బాలీవుడ్ మెగాస్టార్ లుక్ ఇదిగో.. ఇదే!

- Advertisement -

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ‘సైరా’ జీవిత క‌థ‌గా మెగాస్టార్‌ చిరంజీవి 151 సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో వేగంగా జ‌రుగుగుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌కు అమితాబ్ చేరుకున్నారు. చిరంజీవి కోరిక మేరకు ‘సైరా’ నటించేందుకు అంగీకరించానని తెలిపిన అమితాబ్‌ సినిమాలో తన లుక్‌ ను రివీల్‌ చేస్తూ ఓ తెలుగు ట్వీట్‌ చేశారు.

‘సూపర్‌స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్‌లో ఒక గౌరవం ఉండాలి’ అంటూ అమితాబ్ తెలుగులో ట్వీట్ చేస్తూ ‘సైరా’లో త‌న లుక్ ఎలా ఉంటుందో విడుద‌ల చేశారు. అమితాబ్‌ గురువారం (మార్చి 29) నుంచి సైరా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘సైరా’ పాత్ర‌లో చిరంజీవి ప‌క్క‌న నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్ ఈ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను భారీగా రామ్‌చ‌ర‌ణ్ తేజ నిర్మిస్తున్నాడు. 2019 వేస‌విలో ఈ సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -