Saturday, April 20, 2024
- Advertisement -

నీ ధైర్యం చాలా గొప్పది – బిగ్ బి అమితాబ్

- Advertisement -

నటుడు ఇమ్రాన్ హష్మని బిగ్ బి అమితాబ్ బచ్చన్ పొగడ్తలతో ముంచెత్తారు. నీ ధైర్యానికి నా వందనాలు అంటూ ట్విట్ చేశారు అమితాబ్. ఇమ్రాన్ హష్మి ఆరేళ్ల కుమారుడు అయాన్ కిడ్నీ సంబంధిత క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతడ్ని ఈ వ్యాధి నుంచి కాపాడేందుకు ఇమ్రాన్ హష్మి కొడుకుకు కెనడాలో వైద్యం చేయించారు.

అయాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తండ్రిగా ఇమ్రాన్ హష్మి ధైర్యానికి ముచ్చటపడిన అమితాబ్ నువ్వు చాలా గొప్పొడివి అంటే ట్విట్ చేశారు. దీనికి స్పందించిన ఇమ్రాన్ హష్మి మీ కంటే ఈ లోకంలో ఇంకెవరు ధైర్యవంతులు, గొప్పవారు లేరు అంటూ తిరిగి ట్విట్ చేశారు.

ఇమ్రాన్ కుమారుడి వ్యాధి, తల్లితండ్రులు పడిన మానసిక క్షోభపై రాసిన కిస్ ఆఫ్ లైఫ్ పుస్తకాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కూడా ఇమ్రాన్ హష్మ ధైర్యాన్ని కొనియాడారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -