Monday, April 29, 2024
- Advertisement -

పవన్ మూవీకి రామ్ చరణ్ నిర్మాత!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కలక్షన్లు పరవలేదు కానీ సినిమాపై మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. హిందిలో కూడా ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వస్తుంది. ఈ విశిషయం పక్కనబెడితే కొన్ని నెలల క్రితం బ్రూస్ లీ విడుదల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

బ్రూస్ లీ రిజల్ట్ చెర్రీని మాత్రమే కాకుండా.. చిరును కూడా డిజప్పాయింట్ చేసింది. ఏళ్ల తర్వాత తను స్క్రీన్ పై కనిపించినా.. అలాంటి రిజల్ట్ రావడం డైలమాలో పడేసింది. ఆ సమయంలో పవన్ యాక్టివ్ పార్ట్ తీసుకుని.. చిరు ఇంటికి వెళ్లి అందరితో మాట్లాడాడు. రాజకీయ విబేధాలను పక్కన పెట్టి కనీసం సర్దార్ కోసం వేసిన పోలీస్ గెటప్ ను ఛేంజ్ చేసుకోకుండా డైరెక్టుగా వెళ్లిపోయాడు.

అంతే కాదు.. త్వరలో రామ్ చరణ్ హీరోగా తను నిర్మాతగా ఓ మూవీ చేయనున్నట్లు చెప్పాడు కూడా. ఇప్పుడు సీన్ మారిపోయింది. సర్దార్ రిజల్ట్ పవన్ కి షాక్ ఇచ్చింది. పవన్ పవర్ ను సరిగా చూపించే సినిమా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అందుకోసం చిరు 150వ సినిమా కోసం స్టార్ట్ చేసిన బ్యానర్ పై.. మరుసటి మూవీ తనే చేయాలని నిర్ణయించుకున్నాడట రామ్ చరణ్. అన్నీ కుదిరితే.. పవన్ నెక్ట్స్ మూవీకి నిర్మాత రామ్ చరణే అంటున్నాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -