Saturday, April 20, 2024
- Advertisement -

అమితాబ్ లీక్స్‌తో ‘సైరా’ సినీ బృందానికి త‌లనొప్పి..

- Advertisement -

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ‘సైరా’ జీవిత క‌థ‌గా మెగాస్టార్‌ చిరంజీవి 151 సినిమా రూపొందుతుండ‌గా బాలీవుడ్ మెగాస్టార్ ఆ సినిమా ఫొటోలు లీక్ చేస్తున్నారు. మెగాస్టార్‌తో ప‌ని చేయ‌డం గౌర‌వంగా ఉంది అంటూ ఒక ఫొటోను లీక్ చేశారు. అంతే కాకుండా సైరాలో త‌న పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను కూడా బిగ్ బీ విడుద‌ల చేశారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో వేగంగా జ‌రుగుగుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌కు అమితాబ్ చేరుకుని షూటింగ్‌లో పాల్గొంటున్నారు. చిరంజీవి కోరిక మేరకు ‘సైరా’ నటించేందుకు అంగీకరించానని తెలిపిన అమితాబ్‌ సినిమాలో తన లుక్‌తో పాటు చిరంజీవి, న‌య‌న‌తార కూర్చుని ఉన్న ఫొటోను లీక్ చేశాడు.

‘సూపర్‌స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్‌లో ఒక గౌరవం ఉండాలి’ అంటూ అమితాబ్ తెలుగులో ట్వీట్ చేస్తూ ‘సైరా’లో త‌న లుక్ ఎలా ఉంటుందో విడుద‌ల చేశారు. అమితాబ్ సైరా షూటింగ్‌లో పాల్గొంటూ ఆ విశేషాల‌ను పంచుకుంటున్నారు. ‘సైరా’లో చిరంజీవి ప‌క్క‌న నయనతార నటిస్తోంది. చిరంజీవి, న‌య‌న‌తార పూజ‌లు చేస్తుండ‌గా ఆ ప‌క్క‌న నిల‌బ‌డి ఉన్న పాత్ర‌లో అమితాబ్ ఉన్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్ ఈ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను భారీగా రామ్‌చ‌ర‌ణ్ తేజ నిర్మిస్తున్నాడు. 2019 వేస‌విలో ఈ సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -