Saturday, May 18, 2024
- Advertisement -

పుకార్ల‌కు ఫుల్‌స్టాప్‌.. త్వ‌ర‌లో ‘సైరా`లో బిగ్ బీ

- Advertisement -

పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసేట‌ట్టు ఉంది సైరా సినిమా విష‌యాలు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ త్వ‌ర‌లో పాల్గొనున్నాడ‌ని స‌మాచారం వినిపిస్తోంది. ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సైరా నరసింహారెడ్డి అనే పదాన్ని మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా టైటిల్‌గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోష‌న్ పిక్చ‌ర్ విడుద‌ల చేశారు కానీ ఈ సినిమా గురించి ఇంకా ఏ విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు.

అయితే ఈ సినిమాకు వ‌రుస దెబ్బ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుండ‌గా… ఈ సినిమాను రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. ఎట్ట‌కేల‌కు అమితాబ్‌తోనే సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడు. అందుక‌నుగుణంగా చ‌ర్య‌లు తీసుకొని చివ‌ర‌కు బిగ్ బీని షూటింగ్‌లో పాల్గొనేట్టు రామ్‌చ‌ర‌ణ్ చేశాడంట‌. ”సైరా” సెట్స్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ‘సైరా’ యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సైరా నుంచి బిగ్ బి తప్పుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిన తరుణంలో.. అమితాబ్ సైరా షూటింగ్‌లో పాల్గొంటారని యూనిట్ తెలిపింది.ఈ సినిమాలో చిరంజీవి ప‌క్క‌న నయనతార న‌టిస్తోంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -