Tuesday, May 7, 2024
- Advertisement -

మెగా ఫ్యామిలీలో ఎధ‌వ ఎవ‌రంటే..

- Advertisement -

మెగా న‌టుడు వ‌రుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన చిత్రం ఈనెల పదో తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రాశీఖ‌న్నాతో క‌లిసి వ‌రుణ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ సినిమా మంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా మీడియాతో పిచ్చ‌పాటిగా మాట్లాడారు. త‌న వ్య‌క్తిగ‌త‌, కుటుంబ విష‌యాల‌ను పంచుకున్నాడు. అయితే ఒక ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట చెప్పాడు. త‌న‌ను త‌మ ఇంట్లో త‌న తండ్రి నాగ‌బాబు ఎధ‌వ అని పిలుస్తారంట‌. ‘నన్ను ఇంట్లో నాన్న ఎధ‌వ అని పిలుస్తుంటాడు. త‌ల్లి వరుణ్‌ను బాబూ అంటుంది. ఇంకా చాలానే ముద్దుపేర్లు ఉన్నాయి’ అని చెప్పాడు.

ఇక హైదరాబాద్ యూసఫ్‌గూడలోని సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని, ఎవరైనా అమ్మాయి దొరికితే చెబుతానని చెప్పాడు. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు అని, అతడి కన్నా ఒక అంగుళం ఎక్కువ ఎత్తే ఉన్నానని అన్నాడు. తన వయసును దాచుకోబోనని 1990 జనవరి 19వ తేదీన పుట్టిన తనకు ఇప్పుడు 28 ఏళ్లని చెప్పాడు. ‘ఘాజీ’ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించాలని ఉందని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -