Friday, May 3, 2024
- Advertisement -

షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ

- Advertisement -

అర్జున్ రెడ్డి.. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి మంచి ఫాలోయిం లభించింది. అంతేకాకుండా ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి.. బాగా వసూళ్లు రాబట్టింది. సినిమా యూత్ ని బాగా ఆకట్టుకోవడంతో.. విజయ్ కి యూత్ లో బాగా గుర్తింపు లభించింది.

ఈ క్రేజ్ తో అరడజను పైగా కొత్త ప్రాజెక్టులను అర్జున్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. విజయ్ దేవర కొండ రాహుల్ అనే కొత్త దర్శకుడితో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక సినిమా చేయడానికి సంతకం చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇక విజయ్ దేవరకొండతో చేయడానికి చాలామంది హీరోయిన్స్ రెడీగా వున్నారు. అయినా ఈ సినిమాలోను ప్రియాంకా జవాల్కర్ అనే కొత్త అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకున్నారు.

అర్జున్ రెడ్డి ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం మాత్రమే వుందని.. అర్జున్ రెడ్డి సరసన జోడీ కడితే అమ్మడుకు మంచి క్రేజు లభిస్తుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. ఎందుకంటే? ఇప్పటికే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండతో జోడీ కట్టిన షాలినీ పాండే వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -