Saturday, May 11, 2024
- Advertisement -

హిట్ కొట్టేసలాగానే ఉన్నాడు

- Advertisement -

రాజా ది గ్రేట్… రిలీజ్ కు ముందే హిట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ముక్యమైన వ్యక్తులను బట్టి… ఇది అర్ధమవుతుంది. ఈ సినిమా నిజానికి ముందుగా… కొందరు హీరోల దగ్గరికి వెళ్లింది. అయితే హీరో అంధుడు కావడంతో ఎవ్వరూ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదట. ఇదే విషయాన్ని దిల్ రాజు చెప్పారు.

గతంలో ఆర్య విషయంలో కూడా ఇదే జరిగిందని దిల్ రాజు చెబుతున్నారు. మొదట్లో ఆర్య చిత్రం రవితేజకు వెళ్లింది. ఆ తర్వాత ప్రభాస్ ,నితిన్ దగ్గరకు కూడా పోయింది. కాని వారెవరూ ఆర్యను టేకప్ చేయడానికి ఆసక్తి చూపలేదు. హీరోయిజం చూపించకుండా ఇంటిలెక్చువల్ గా విలన్ ను ఎదుర్కొనే ఈ కాన్సెప్ట్ ను చేయడానికి అప్పట్లో బన్నీ మాత్రమే యాక్సెప్ట్ చేశాడు.

అదే మాదిరిగా రవితేజ చేసిన రాజా ది గ్రేట్ ను టాప్ హీరోలెవరు చేయడానికి ఒప్పుకోలేదు. చివరికి రవితేజ ఒప్పుకోవడం ..ఆ తర్వాత జరిగిన స్టోరీ మార్పులలో దాని స్వభావమే మారిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని డైరెక్టర్ అనీల్ రావిపూడి చెబుతున్నారు. ల్యాబ్ టాక్ కూడా సూపర్బ్ గా రావడంతో చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయమని టాలీవుడ్ పరిశ్రమ ముక్తకంఠంతో చెబుతుందంటే సినిమా గురించి ఏ స్థాయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయో అర్ధం చేసుకో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -