Thursday, May 2, 2024
- Advertisement -

వితండ వాదం జనాలదా, అనసూయ దా?

- Advertisement -

కబీర్ సింగ్ సినిమా బాలీవుడ్ లో పెద్ద హిట్ సాధించింది. తెలుగు లో హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా కి ఇది హిందీ లో రీమేక్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన సినిమా గురించి చేసిన కొన్ని కామెంట్స్, అలాగే క్రిటిక్స్ ని విమర్శించిన తీరు కొంత మందిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే దానిని ఖండించే వాళ్ళు కొంత మంది ఖండిస్తున్నా ఫెమినిస్ట్స్ అని చెప్పుకుంటూ మాకు తప్ప ఫెమినిస్ట్స్ అన్న పదానికి అర్ధం ఇంక ఎవ్వరికీ తెలియదు అనే విధం గా కొంత మంది బిహేవ్ చెయ్యడం విచిత్రం గా ఉంది.

ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ని విమర్శించిన అనసూయ కూడా ఇప్పుడు సందట్లో సడేమియా అంటూ ట్విటర్ లో కి వచ్చి సందీప్ కామెంట్స్ ని ఖండిస్తూ తాను అర్జున్ రెడ్డి అప్పుడు కూడా ఈ విషయాన్ని ఖండించినప్పుడు ఫెమినిస్ట్స్ తనకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని వాపోయింది.

నిజానికి అనసూయ సమక్షం లో, అనసూయ పూర్తి కాన్షియస్ లో ఉన్నప్పుడు తను హోస్ట్ చేసే ఒక టీవీ షో లో ఎక్కువ గా మహిళల ని కించపరిచే లా జోక్స్ ఉంటాయి. చాలా సార్లు అవి వెగటు పుట్టిస్తాయి కానీ అనసూయ మాత్రం హాపీ గా నవ్వుతూ ఉంటారు. వీటి కన్నా సందీప్ తన సినిమా ని డిఫెండ్ చేసుకుంటూ చెప్పిన మాటలు ప్రమాదకరం ఏమి కాదు. అదే విషయాన్ని అనసూయ కి కొంత మంది చెప్తే వారు చేసేది వితండ వాదం అని కొట్టి పారేసింది అనసూయ.

నిజానికి వితండ వాదం చేస్తున్నది వాళ్ళా, అనసూయ నా అని ఒక్కసారి ఆలోచిస్తే ఆమెకే అర్ధం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -