Wednesday, May 8, 2024
- Advertisement -

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో చెత్త రికార్డును న‌మోదు చేసిన ధోని…అది కీపింగ్‌లో

- Advertisement -

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ఈ ప్రపంచకప్‌ ఏ మాత్రం అచ్చిరాలేదు. అన్ని మ్యాచ్‌ల‌ల్లో స్లోబ్యాటింగ్ కార‌ణంగా అన్ని వ‌ర్గాల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌లు ఒక వైపు వ‌స్తుంటె ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో చెత్త రికార్డును న‌మోదు చేశారు. అది కూడా కీపింగ్‌ విషయంలో కావడం గమనార్హం. ధోని అంటే ప్రపంచశ్రేణి వికెట్‌ కీపర్‌. అతను వికెట్ల వెనుకాల ఉంటే ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా క్రీజు దాటి సాహసం చేయరు. అలాంటిది ఐసీసీ కూడా ధోని వ‌కెట్ట వెనుక ఉంటే బ్యాట్స్ మేన్‌లు జాగ్ర‌త్త అంటూ ట్వీట్ చేసిందంటె ధోని సామ‌ర్థ్యం అచేసుకోవ‌చ్చు.

మ‌దుప‌టి వేగం, చురుకు ద‌నం ధోనీలో త‌గ్గింది. దీంతో బైస్‌ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న వికెట్‌ కీపర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఈ మెగాటోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన ధోని ఏకంగా బైస్‌ రూపంలో 24 పరుగులు ఇచ్చాడు. టోర్నీ మొత్తం బైస్‌ రూపంలో 71 పరుగులే రాగా.. ధోని ఒక్కడే 24 పరుగులు ఇవ్వడం అతని కీపింగ్‌ లోపాన్ని తెలియజేస్తుంది. ధోనీ త‌ర్వాత ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ 9 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం టోర్నీలో క్యారీ 17 ఔట్లతో వికెట్‌ కీపర్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా..9 ఔట్లతో ధోని 9 స్థానంలో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -