Tuesday, April 30, 2024
- Advertisement -

సిల్క్ స్మిత బయోపిక్? అనసూయ కు అదృష్టం వరించేనా?

- Advertisement -

బుల్లితెరపై తన సత్తా చాటుతూ వచ్చిన హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది. జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ అనతి కాలంలోనే తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంది. కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’చిత్రంలో రంగమ్మత్తగా దుమ్మురేపింది.

ఆ తర్వాత అనసూయకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఓ వైపు బుల్లితెరపై తన మార్క్ చాటుకుంటూనే వెండితెరపై రాణిస్తుంది. తాజాగా ఈ అమ్మడికి మరో అదృష్టం కలిసి వచ్చిందంటున్నారు. తాజగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం .. కోలీవుడ్.. తమిళ్..’ అంటూ తాజాగా అనూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఓ ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఈ మూవీ హిట్ అయితే తమిళనాట కూడా ఈ అమ్మడు సత్తా చాటుతుందంటున్నారు.

ఇందులో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పోజు ఇచ్చింది.  ఈ చిత్రంలో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -