Friday, April 19, 2024
- Advertisement -

మూత్రపిండాల్లోరాళ్ళు సమస్య నివారణకుతీసుకోవాలిసినజాగ్రత్తలు!

- Advertisement -

మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడకట్టుతాయి. మౌనంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు కొన్ని ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరిక్షణం వరకూ మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరుకు కిడ్నీ అంతా పాడైపోయినపుడే పనిచేయటం మానివేస్తాయి.

ఈ మధ్య మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటిశాతం తగ్గి, లవణాల గాఢత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉండడటమే అంటారు.

నివారణ :

*పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్లరేణువులు పడిపోతాయి .
*పల్లేరు కాయలు (గోక్షుర) సేకరించి, నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి, పొడి చేసి వస్తగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని అర టీస్పూన్ తేనె కలిపి, గొర్రె పాలతో వారంపాటు తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి
*కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్దిరోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
*దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
*పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజులపాటు ఉదయం, ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లుకూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి
*కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది
*దోశగింజలనూ నక్కదోశ గింజలనూ ముద్దగా నూరి ద్రాక్షపండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*బూడిద గుమ్మడికాయలు, బూడిదగుమ్మడిపూల స్వరసంలో యవక్షారాన్ని, బెల్లాన్నీ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
*మునగచెట్టు (శిగ్రు) వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్లు పడిపోతాయి
*చేదు ఆనపకాయ గింజల (కటుతుంబీ) చూర్ణాన్ని తేనెతో కలిపి గొర్రెపాలతో ఏడు రోజులపాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి రోజుకు 8-13 గ్లాసుల నీళ్లు తాగాలి.


కాల్షియం, ఆగ్జలేట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవద్దు. ఉదాహరణకు యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, ఛీజ్, ద్రాక్ష, ఐస్‌క్రీమ్, విటినరుగు, టమటా, కమలాపండ్లను మానేయటం గాని బాగా తగ్గించటం గాని చేయాలి.
ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి.
ఉప్పు వాడకాన్ని కూడా రోజుకు 2-3 గ్రాములకు తగ్గించాలి.
విటమిన్-సి, డిలను సప్లిమెంట్ల రూపంలో యధేచ్చగా తీసుకోవద్దు.
మద్యం అలవాటు ఉంటే మానేయాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -