Wednesday, May 15, 2024
- Advertisement -

కౌశ‌ల్ ఆర్మీపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన యాంక‌ర్ అన‌సూయ‌

- Advertisement -

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌తో పోలిస్తే రెండో సీజ‌న్‌పై కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చింది.షోకి వ‌చ్చిన సెల‌బ్రిటీస్ ఎవ్వ‌రు పెద్ద ఫేమ‌స్ కాక‌పోవ‌డంతో చాలా మంది నిరాశ‌కు గురైయ్యారు.అయితే ఈ స‌మ‌స్య నుండి తొంద‌ర‌గానే బ‌య‌ట‌ప‌డింది బిగ్‌బాస్ టీం.ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్,గేమ్స్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను టీవీల ముందు కూర్చోబెట్టింది.ఇక షోలో గొడ‌వ‌ల‌కు కొద‌వ లేక‌పోవ‌డంతో చాలామంది ఆస‌క్తిగా బిగ్‌బాస్‌ను తిల‌కిస్తున్నారు.తాజాగా యాంక‌ర్ అన‌సూయ బిగ్‌బాస్ పై మాట్లాడుతు… నేను బిగ్‌బాస్‌ను చూడ‌టం లేద‌ని,కాని నా స్నేహితులు ద్వారా బిగ్‌బాస్ ఫిడ్‌బ్యాక్ అడిగి తెలుసుకుంటున్నానని తెలిపింది.

ఈ సంద‌ర్భంగా బిగ్‌బాస్ హౌస్‌మెట్ అయిన కౌశ‌ల్ గురించి ప‌లు కామెంట్స్ చేసింది.ఇక అతినికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంద‌ని,కౌశ‌ల్ గేమ్ బాగా ఆడుతున్నాడని చెప్పుకొచ్చింది.కౌశ‌ల్ నిజాయితిగా ఉండ‌టం వ‌ల్లే హౌస్‌లోని మిగ‌త స‌భ్యుల‌కు న‌చ్చ‌డం లేదని తెలిపింది.దీని కార‌ణంగానే కౌశ‌ల్‌కు బ‌య‌ట భారీ ఫాలోయింగ్ వ‌చ్చింద‌ని,ఓ స్టార్ హీరోతో స‌మానంగా అతనికి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది.ఇక ఇప్ప‌టికే కౌశ‌ల్‌తో గొడ‌వ ప‌డిన ఇంటి స‌భ్యుల‌ను కౌశ‌ల్ ఆర్మీ బ‌య‌టికి పంపించిన సంగ‌తి తెలిసిందే.

https://www.youtube.com/watch?v=RYqqvQzep5Q

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -