Friday, May 17, 2024
- Advertisement -

వైసీపీకి కాపుల సెగ‌…. పార్టీనీ వీడుతున్న ద్వితీయ‌శ్రేని నాయ‌కులు ఇక తూర్పున క‌ష్ట‌మేనా…?

- Advertisement -

వ‌చ్చే సాధార‌న ఎన్నిక‌ల్లో కాపులు కీల‌కం కానున్నారు. వీరిని ప్ర‌స‌న్నం చేసుకొనేందుకు అన్ని పార్టీలు నానాతిప్ప‌లు ప‌డుతున్నాయి. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేయి దులుపుకున్నారు. ఇక జ‌గ‌న్ కూడా గోదావ‌రి జిల్లాల పాద‌యాత్ర‌లో కాపు రిజ‌ర్వేష‌న్‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెల‌సిందే. అది నాచేతుల్లో లేద‌ని కేంద్రం చేతుల్లో ఉంద‌న్న జ‌గన్‌పై కాపునేత‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌కు కాపుల సెగ త‌గిలింది. ఆయనకు తూర్పు గోదావరి జిల్లాలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పార్టీని వీడే అవకాశాలున్నాయి. ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్లపై నోరుజారడం, కాపు రిజర్వేషన్లపై తీసుకున్న వైఖరి జగన్ కు ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

దుర్గేశ్‌ కూడా పార్టీని వీడడం జగన్ కు కొంత మేరకు నష్టం కలిగించే విషయమేనని అంటున్నారు. దుర్గేష్ వైసీపీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి టికెట్‌ ఆశించారు. గతంలో పోటీచేసిన ఆకుల వీర్రాజుకే టికెట్‌ ఇస్తామని జగన్‌ చెప్పినట్లు సమాచారం. ఈలోగా జిల్లాలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో దుర్గేశ్‌ వైసీపీకి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై చంద్ర‌బాబు మాదిరిగానే హామీ ఇచ్చారు ప‌వ‌న్‌. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని 9 షెడ్యూల్‌లో చేర్చి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని జ‌న‌సేనుడు ప్ర‌క‌టించారు. దీంతో కాపులు అంద‌రూ ప‌వ‌న్ వైపు వెల్ల‌డం ఖాయంగా కనిపిస్తోంది. దుర్గేష్ వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీ చేయడానికి కూడా నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల స‌మయానికి జ‌గ‌న్‌కు మ‌రిన్ని ఇబ్బందులు ఎద‌ర‌వుతాయ‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -