Saturday, May 18, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ర‌చ్చ చేయ‌నున్న‌రంగ‌మ్మ‌త్త‌…

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ రోజు రోజుకి మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తుంది.షోపై మొద‌ట్లో కొంత వ్య‌తిరేక‌త ఎదుర్కొన్న‌ప్ప‌టికి వాటిని అధిక‌మించి షో మంచి రేటింగ్స్‌తో న‌డుస్తుంది. ఆదివారం నాని చెప్తూ ప‌ది కోట్లు ఓట్లు వ‌చ్చాయ‌ని చెప్ప‌డం షోకి రేటింగ్‌ను పెంచుకొనే దిశ‌లో ముందుకు సాగుతోంది బిగ్‌బాస్‌.

రేటింగ్ పెంచుకొనేదానికి బిగ్ బాష్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌తీ సారి ఒక సెల‌బ్రిటీనీ బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించి రేటింగ్ పెంచుకుంటోంది. ఇప్పుడు తాజాగా రంగ‌మ్మ‌త్త‌ను రంగంలోకి దించారు. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ గొడవలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సృష్టించింది ఈ రియాల్టీ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్‌ ఎంట్రీలతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాడు.

ఇక ఎపిసోడ్‌ చివర్లో హౌస్‌లో పెళ్లి సందడి నెలకొందని హింట్‌ ఇస్తూ.. ఓ ప్రోమోతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కట్టిపడేశారు.అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ హౌస్‌లో సందడి చేస్తోంది. పెళ్లి సందడి టాస్క్‌లో భాగంగా ఆమె సెలబ్రిటీ హోదాలో ముఖ్య అతిథిగా హాజరైనట్లు అర్థమవుతోంది.

సూయ..సూయ అనసూయ సాంగ్‌తో బిగ్‌బాస్‌ ఆమెకు ఘనస్వాగతం పలకగా.. ఇంటి సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో అనసూయను రీసివ్‌ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే నేటి ఎపిసోడ్‌లో రంగమ్మత్త అలరించనున్నారు.

https://www.instagram.com/p/BmvXrS9BFql/?utm_source=ig_share_sheet&igshid=1714zbdugad8b

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -