Tuesday, May 21, 2024
- Advertisement -

స్వ‌ల్ప‌లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

- Advertisement -

మంగళవారం నాటి మార్కెట్లు స్వల్ప లాభాలు న‌మోదు చేసిన‌ప్ప‌టికి… కొత్త రికార్డులను నమోదు చేశాయి.ఉద‌యం లాభాల‌తో ప్రారంభ మ‌యిన స్టాక్ మార్కెట్ల దూకుడు ఎంతో సేపు కొన‌సాగ‌లేదు. అంతర్జాతీయ పరిణామాలు, కొనుగోళ్ల ఒత్తిడితో సూచీలు ఒడుదొడుకులకు గురయ్యాయి. దీంతో మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలను నమోదుచేశాయి.

తద్వారా జీవనకాల గరిష్ఠ స్థాయులను తాకాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 38,286కు పెరిగింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 11,571 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కజారియా సిరామిక్స్ (10.53%), కేఆర్ఎల్బీ లిమిటెడ్ (8.89%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (7.31%), సీఈఎస్సీ లిమిటెడ్ (7.01%), కమిన్స్ ఇండియా (6.70%).

టాప్ లూజర్స్:
హెచ్డీఐఎల్ (-4.85%), అమరరాజా బ్యాటరీస్ (-3.05%), జెట్ ఎయిర్ వేస్ (-2.94%), ఇండియా బుల్స్ రియలెస్టేట్ (-2.92%), డీఎల్ఎఫ్ (-2.91%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -