బికినీలో పిచ్చెక్కిస్తున్న అనసూయ..

Anchor Anasuya raises the temperature in bikini
Anchor Anasuya raises the temperature in bikini

యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాక్షి టీవీలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ యాంకర్‌గా మారి, ఆ తర్వాత జబర్దస్త్ వంటి కార్యక్రమాలు చేయడం ప్రారంభించింది. జబర్దస్త్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ఒక యాంకర్‌కి ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోయేలా ఆమెకు క్రేజ్ ఉంది.

ప్రస్తుతానికి జబర్దస్త్‌కి దూరంగా ఉన్న అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. తన బికినీ పిక్స్‌తో టెంపరేచర్‌ను పెంచి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. తన భర్త భరద్వాజ్ తో లిప్-లాక్ ఫోటోను మరియు బికినీ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె అందంపై అనేక కామెంట్లు చేస్తున్నారు.

అనసూయ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు రావడంతో యాంకరింగ్‌కి కాస్త దూరం అయింది. ఇటీవల కృష్ణ వంశీ నటించిన రంగ మార్తాండ చిత్రంలో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనసూయ ప్రస్తుతం విమానం, పుష్ప 2తో పాటు పలు చిన్న సినిమాల్లో నటిస్తోంది.