Tuesday, April 30, 2024
- Advertisement -

జగన్‌కు పవర్‌ పక్కా..అస్త్రాలు సిద్దం..!!

- Advertisement -

ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ రాబోవు ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లే కనిపిస్తోంది. శత్రువులు కలిసి వచ్చిన విడివిడిగా వచ్చిన ఢీ కొట్టేందుకు జగన్ సన్నద్దం అవుతున్నారు. 2019 మాదిరిగానే 2024 ఎన్నికలు కూడా వన్ సైడ్‌గా రావాలని జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన ప్రణళికలు కనిపిస్తున్నాయి. తెలంగాణతోపాటే, ఏపీలో కూడా ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జరిగితే అది వైసీపీ లాభమా నష్టమా అని ప్రశ్నిస్తే..లాభ‌మే ఎక్కువ‌నే స‌మాధానాలు వ‌స్తోంది. రాజకీయ పరిశీలకులు ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జరిగితే కనుక అది కచ్చింతంగా జగన్‌కు కలిసి వస్తుందని అంటున్నారు. ఎలా చూసుకున్న అన్ని ప్రాంతాల్లో జగన్‌కు 40 శాతం ఓటింగ్ ఉందని.. ఈ లెక్కన చూస్తే వైసీపీ 120 సీట్లు ఖాయం అని రాజకీయ పండితులు చెబుతున్నారు. దీనితో పాటు గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను 90 శాతానికి పైగానే నెరవేర్చారు.

తాజాగా చంద్రబాబు కూడా జగన్ కన్నా తాను ఎక్కవే పథకాలను ఇస్తానని చెబుతున్నప్పటికి కూడా ఆయనపై ప్రజలు పూర్తిగా నమ్మకం ఉంచలేని పరిస్థితి. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే ఇచ్చిన మాట మీద నిలబడేతత్వంలో జగన్‌లో ఉందని ప్రజలు గుర్తిస్తే కనుక రాబోవు ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం.ఏ ఒక్క నాయ‌కుడి సిఫార‌సుతో ప‌నిలేకుండా అర్హ‌త ఉంటే చాలు…సంక్షేమ ప‌థ‌కాలు ఇంటికి రావడం జగన్‌కు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక ఇదే సమయంలో చంద్రబాబు ఎన్నికలకు రెడీగా లేరు. ఇటువంటి సమయంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే కనుక ప్రత్యర్థులకు షాక్ ఇవ్వడంతో పాటు..ఆయన మరోమారు సీఎం అయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -