Sunday, May 19, 2024
- Advertisement -

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన యాంక‌ర్ లోబో

- Advertisement -

యాంక‌ర్ ,క‌మెడియ‌న్ లోబో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు.లోబో ప్ర‌యాణిస్తున్న‌ కారు జ‌న‌గాం వ‌ద్ద ఆటోను ఢీ కొట్టింది.ఈ ఘ‌ట‌న‌లో ఆటోలో ప్ర‌యాణిస్తున్న 4 గురి ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో వారిని వైద్యం నిమిత్తం హుటాహుటిన హైద్రాబాద్ కు త‌ర‌లించారు.లోబో జ‌న‌గాం ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

లోబో డ్రైవ‌ర్ కారు నియ‌త్రించ‌లేని కార‌ణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అక్క‌డ ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు తెలిపారు.కారు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు లోబో వెనుక సీట్లో కుర్చున్నాడ‌ని తెలుస్తుంది.ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూ నిమిత్తం వ‌రంగ‌ల్ నుండి హైద్రాబాద్‌కు తిరిగి వ‌స్తున్న లోబో కారు ప్ర‌మాదనికి గురైంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -