Saturday, May 18, 2024
- Advertisement -

కీర్తి డబ్బింగ్ కష్టాలు(వీడియో)

- Advertisement -

అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రను పోషించడమే పెద్ద సవాలైతే.. భాష రాకున్నా ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరో పెద్ద సవాల్. సావిత్రి లాంటి మహానటిని మ్యాచ్ చేయడమంటే మాటలు కాదు. సావిత్రి లాంటి రూపం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆమెలా అభినయించాలి. ఆమెలా హావభావాలు పలికించాలి. ఆమెలా నడవాలి. ఆమెలా మాట్లాడాలి. ఐతే ఈ విషయాలన్నింటిలో కీర్తి మంచి మార్కులే కొట్టేసింది. కీర్తి సురేష్ ఇప్పటి వరకు తెలుగులో ‘నేను శైలజ’, ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో మాత్రమే నటించింది.

దీంతో ‘మహానటి’ సినిమాలో డబ్బింగ్ చెప్పేందుకు చాలా ఇబ్బందిపడింది.ఐతే తెలుగు భాష నేర్చుకుని.. సావిత్రి పాత్ర చేస్తూ స్పష్టంగా డైలాగులు చెప్పడమంటే అంత సులువైన విషయం కాదు. డబ్బింగ్ స్టూడియోలో కీర్తి ప‌డిన పాట్లన్నింటినీ వీడియోని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ వీడియో చూసిన వారు కీర్తి ఎంత క‌ష్ట‌ప‌డిందో అర్థం అవుతుంది.తెలుగు రాని ఆమె డబ్బింగ్ చెబుతున్నప్పుడు పడిన కష్టాలను ‘మహానటి’ బృందం రికార్డు చేసి శనివారం యూట్యూబ్‌లో విడుదల చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -