Friday, May 3, 2024
- Advertisement -

వ‌చ్చి రాగ‌నే ఆడుకున్నాడుగా..!

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారుతోంది. సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో.. సీజన్ 2 కూడా అదే రేంజ్ లో హిట్ చేసేందుకు స్టార్ మా టీం బాగానే ట్రై చేస్తోంది.ఇక సీజ‌న్‌నున్యాచుర‌ల్ స్టార్ నాని త‌నదైన శైలిలో ముందుకు న‌డిపిస్తున్నాడు.అయితే షోని మ‌రింత రంజుగా న‌డ‌ప‌డానికి బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా యాంక‌ర్ ప్ర‌దీప్‌ను తీసుకువ‌స్తున్నారు.తెలుగు యాంక‌ర్లు చాలామంది ఉన్న‌ప్ప‌టికి ప్ర‌దీప్ స్టైల్ వేరు.ఎప్పుడు హూషారుగా ఉంటు త‌న ప‌క్క‌వారిపై జోకులు వేస్తుంటాడు ప్ర‌దీప్‌.

అయితే ప్ర‌దీప్‌ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ద్వారా షోకి మ‌రింత రేటింగ్ సాధించవచ్చ‌ని బిగ్‌బాస్ టీం ఆశిస్తుంది. ప్రదీప్ ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియో ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్ హౌజ్ లోకి అడుగుపెట్టిన వెంటనే సందడి మొదలైంది. ప్ర‌దీప్ వ‌చ్చి రాగానే దీప్తి సునైనాను తెగ ఏడిపించాడు.ప్ర‌దీప్ బిగ్‌బాస్‌కు రావ‌డం ద్వారా షో మ‌రింత ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. బుల్లితెర మీద ఆక‌ట్టుకున్న ప్ర‌దీప్ రియాల్టీ షోలో ఎలా ఆక‌ట్టుకుంటాడో చూడాలి.ఇక ఈ వారం ఎలిమినేష‌న్‌లో దీప్తి,తేజ‌స్వీ,రోల్ రైడా,త‌నీష్‌,సామ్రాట్‌.మ‌రి వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -