Thursday, May 2, 2024
- Advertisement -

సింగ‌ర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతుందా?

- Advertisement -

టాలీవుడ్‌లో బ్యూటిఫుల్ సింగ‌ర్‌ల‌లో ఒక‌రైనా సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే అవుననే వార్తలే ఎక్కువగా వినపడుతున్నాయి. సింగ‌ర్‌గా త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది సునీత‌.గ‌తంలోనే సునీత‌కు పెళ్లి అయింది.భార్య‌-భ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగా సునీత త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకుని అత‌నికి దూరంగా ఉంటుంది.చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన సునీత.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. అంతేకాదు.. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగానూ వ్యవహరించారు.

పాటలపోటీలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు.సునీతకు ఇద్దరు పిల్లలున్నారు,వారిద్ద‌రు త‌న ద‌గ్గ‌రే పెరుగుతున్నారు.అయితే.. త్వరలోనే మరో వ్యక్తిని ఆమె తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నారనే వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. మ‌రి ఇంత‌కి ఆమె ఎవ‌రిని వివాహం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -