Thursday, April 18, 2024
- Advertisement -

ఝాన్సీ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అది కాదు – యాంక‌ర్ ర‌ష్మి

- Advertisement -

ప్ర‌ముఖ టీవీ సీరియ‌ల్ న‌టి నాగ ఝాన్సీ రెండు రోజుల క్రితం త‌న ఫ్లాట్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. తారలు ఇలా బలవన్మరణాలకు పాల్పడడంపై ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. సినీ సెల‌బ్రిటీల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఎక్క‌వుగా ఒంటరితనం, ఒత్తిడి, నమ్మకద్రోహం ఇవే కారణమని అంటుంటారు. అయితే సినీ న‌టుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు పని ఒత్తిడి కారణం కాదని అంటోంది యాంక‌ర్ ర‌ష్మి.

ప‌ని ఒత్తిడి కారణంగా ఇండస్ట్రీలో కొందరు సూసైడ్ చేసుకుంటున్నారనే విషయంలో నిజం లేదని చెప్పింది. ప‌ని ఒత్తిడి ఉంటే రెస్ట్ తీసుకోమ‌ని యూనిట్ సభ్యులే తెలుపుతారు. అంతే కాని నీ ఆరోగ్యం బాలేక‌పోయిన చేయాల్సిందే అని ఎవ‌రు ప‌ట్టుబ‌ట్ట‌రు. మరీ ఎక్కువగా ఒత్తిడితో బాధ పడితే సైకియాట్రిస్టుని కలిసి సలహా తీసుకోవాలని చెప్పుకొచ్చింది. కొంద‌ర వ్య‌క్తిగ‌త కార‌ణలతో చ‌నిపోవ‌డం కూడా క‌రెక్ట్ కాద‌ని రష్మి తెలిపింది. ఇలా చ‌నిపోయిన వారికి పని ఒత్తిడి అని చెప్ప‌డం కూడా దారుణం అని తెలిపింది ఈ స్టార్ యాంక‌ర్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -