Friday, April 26, 2024
- Advertisement -

రెండో టీ20లో కివీస్‌ను చిత్తు చిత్తుచేసిన‌ రోహిత్ సేన‌…

- Advertisement -

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. క‌శ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రెచ్చిపోయారు. మెరుపు ఆర్థ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. కృనాల్ కూడా కీలకపాత్ర పోషించ‌డంతో 7వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

భారత ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ(50; 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్‌(30; 31 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ ఔటయ్యాడు. వెంట‌నే శిఖర్‌ (30), విజ‌య్ శంక‌ర్ (14) వికెట్లు కోల్పోయినా .. రిషబ్ పంత్(40 నాటౌట్), ధోనీ(20 నాటౌట్) మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో సమమయ్యింది. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్, సోధి, మిచెల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంత‌కు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగులు చేసింది. మొద‌టి టీ20లో భార‌త భౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన ప్ర‌మాద‌క‌ర బ్యాట్స్‌మెన్ సీఫెర్ట్ (12) ఆరంభంలోనే భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో కీప‌ర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ప‌దిహేను ప‌రుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కృనాల్ పాండ్యా కివీస్‌ను క‌ష్టాల్లోకి నెట్టేశాడు.

మ‌రో ఓపెన‌ర్ మున్రో (12), కూడా నిరాశ ప‌రిచారు. మిచెల్ (1), కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (20) కృనాల్ ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిల‌వ‌లేక‌పోయారు. ఈ ద‌శ‌లో గ్రాండ్‌హోమ్ (50), రాస్ టేల‌ర్ (42) కివీస్‌ను ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 77 ప‌రుగులు జోడించారు. పాండ్యా బౌలింగ్‌లో రోహ‌త్‌కు క్యాచ్ ఇచ్చి గ్రాండ్‌హోమ్ ఔట‌వ్వ‌డంతో వీరి జోరుకు బ్రేక్ ప‌డింది.

టేలర్ (36 ), సాన్‌ట్నర్‌(7)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో కివీస్‌ స్కోరులో వేగం తగ్గింది. ఆపై టిమ్‌ సౌతీ(3) కూడా నిరాశపరచడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో కృనాల్‌కు 3, ఖ‌లీల్‌కు 2 వికెట్లు ద‌క్కాయి. భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడ‌గొట్టారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -