Monday, May 6, 2024
- Advertisement -

సుధీర్‌తో పెళ్లిపై స్పందించిన ర‌ష్మీ

- Advertisement -

సినిమాల‌లో కొన్ని హిట్ పెయిర్ జంటలు ఉంటాయి.కాని బుల్లితెర మీద హిట్ పెయిర్ జంట‌లు చాలా అరుదుగా ఉంటారు.ఇంకా చెప్ప‌లంటే అసలు బుల్లితెర మీద హిట్ పెయిర్ అంటు ఎవ‌రు ఉండ‌రు.కాని వాటిని బ్రేక్ చేస్తు మేం ఉన్నాము అంటు ముందుకు వ‌చ్చారు సుధీర్‌,ర‌ష్మీ.జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోగ్రాం ద్వారా బాగా పాపుల‌ర్ అయిన వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారని గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి.ఈ వార్తలు నిజ‌మే అన్న‌ట్లుగా వీరి ప్ర‌వ‌ర్త‌న కూడా అలాగే ఉంటుంది.

ఇక ఢీ 10లో వీరు చేసే యాక్ష‌న్‌కు రియాక్ష‌న్‌కు సంబంధ‌మే ఉండ‌దు.అస‌లు ఢీ 10 అంత‌టి హిట్ అవ్వ‌డానికి కారణం కూడా ఈ జోడినే.బుల్లితెర వ‌ర‌కు ఓకే కాని బ‌య‌ట మాత్రం ఏం లేద‌ని చెబుతున్నారు వీరిద్ద‌రు.తాజాగా ర‌ష్మీ న‌టించిన అంత‌కు మించి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్య్వూలో పాల్గొంది.ఈ సంద‌ర్భంగా సుధీర్‌తో త‌న‌కున్న బంధాన్ని బ‌య‌ట‌పెట్టింది ర‌ష్మీ.నేను జ‌బ‌ర్థ‌స్త్‌కు వ‌చ్చిన కొత్త‌లో నాకు తెలుగు పెద్ద‌గా రాద‌ని,ఆ స‌మ‌యంలో సుధీర్ నాకు బాగా హెల్ప్ చేశాడ‌ని చెప్పుకొచ్చింది.ఆ స‌మ‌యంలోనే నేను సుధీర్ క్లోజ్ అయ్యామ‌ని,అత‌ను నాకు మంచి ఫ్రెండ్‌గా మారాడ‌ని తెలిపింది.

మా మ‌ధ్య ల‌వ్ అంటు ఏం లేద‌ని ,జ‌స్ట్ మాకు ఇచ్చే స్క్రీప్ట్ ప్రకార‌మే న‌డుచుకుంటామ‌ని ,అంతేకాని మా మ‌ధ్య ఎటువంటి ల‌వ్ ఎఫైర్ లేద‌ని తెలిపింది.ఇక సుధీర్ చాలా మంచి కుర్రాడ‌ని,అతనిలో చాలా టాలెంట్ ఉంద‌ని చెప్పుకొచ్చింది.నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాన‌ని తెలిపింది ర‌ష్మీ.నా పెళ్లికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని ,ప్ర‌స్తుతం నా ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంద‌ని,ఆ త‌రువాతే పెళ్లి గురించి ఆలోచిస్తానంటుంది ర‌ష్మీ.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -