సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూసి నవ్వాలో, ఏడ్వాలో అన్న అనుమానాలు వస్తుంటాయి. అలాంటి చిత్రమైన సంఘటన తమిళనాడులో చోటుచేసకుంది. చనిపోయిన తమ భర్త అంత్యక్రియలకోసం ఇద్దరు భార్యలు కోర్టుకెక్కారు. చివరకు జడ్జికి చిర్రెత్తి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడంతో ఇద్దరు భార్యలు అవాక్కయ్యారు.
తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన దక్షిణమూర్తి తొలుత తంగమ్మాళ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత తంగమ్మాళ్ కు విడాకులు ఇవ్వకుండానే ఏసుమేరి అలియాస్ గౌరీని దక్షిణమూర్తి వివాహం చేసుకున్నాడు.అయితే అతను బ్రదికున్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆనారోగ్యంతో మరణించిన తర్వాత సమస్య మొదలయ్యింది.
మొదటి భార్య తంగమ్మాళ్ ఏమో భర్తను హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయాలని పట్టుబట్టగా, రెండో భార్య ఏసుమేరి మాత్రం దక్షిణమూర్తిని క్రైస్తవ మతాచారం ప్రకారం ఖననం చేయాలని డిమాండ్ చేసింది. ఇద్దరు కూడా మొండిపట్టుదలకు పోవడంతో శవం కుల్లిపోయో దశకు చేరింది.
పోలీసులు జోక్యం చేసుకొని శవాన్ని మార్చరీకీ తరలించారు. దీంతో ఇద్దరు భార్యలు కోర్టుకు వెల్లారు. న్యాయమూర్తి ఇద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఇద్దరికీ దిమ్మతిరిగే తీర్పును ఇచ్చారు. రెండు రోజుల్లోగా ఇద్దరు ఏకాభిప్రాయానికి రాకుంటే అనాథ శవంగా పరిగణించి మున్సిపాలిటీ అధికారులే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేశారు.
