Sunday, May 5, 2024
- Advertisement -

కేర‌ళ‌లో స్నేక్ అల‌ర్ట్ ,ఇళ్ల‌లోకి విష‌స‌ర్పాలు…భ‌యం గుప్పిట్లో ప్ర‌జ‌లు..

- Advertisement -

వరదలు తగ్గుముఖం పట్టడంతో కేరళ ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. స‌హాచ శిబిరాల‌నుంచి త‌మ సొంత ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగిస్తూ.. శుభ్రం చేసుకుంటున్నారు. అయితే ఇళ్ల‌లోఉన్న అథిదుల‌ను చూసి భ‌యంతో వ‌ణికిపోతున్నారు ప్ర‌జ‌లు.

వ‌ర‌ద‌లు త‌గ్గినా ఒక ప‌క్క సంతోషం క‌లిగినా మ‌రో ప‌క్క పాములు, ముస‌ల్ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇళ్లలోకి విష సర్పాలు ప్రవేశించడంతో జనం భయ భ్రాంతులకు లోనవుతున్నారు. ఒక ఇంట్లోకి కొండ చిలువ ప్రవేశించగా.. మరో ఇంట్లో బెడ్ మీద రెండు భారీ తాచుపాములు కనిపించడంతో జనాలు షాకయ్యారు. స్నేక్ ఎక్స్‌పర్ట్‌లు పాములను పట్టుకుని సమీప అటవీ ప్రాంతాల్లో వదులుతున్నారు.

వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత కేరళలో పాము కాట్లు పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రంలో స్నేక్ అలర్ట్ ప్రకటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో యాంటీ వీనంతోపాటు ఇతర మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇళ్లలోని వార్డ్ రోబ్‌లు, కిచెన్, కప్ బోర్డులు, కార్పెట్లు, వాషింగ్ మెషీన్లు, దుస్తులలో పాములు దాగి ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలయాళ మీడియా సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -